శేరిలింగంపల్లి, డిసెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక కొత్త కార్యవర్గం నిర్మాణం నియమాకంలో భాగంగా కోటగిరి మారుతి తండ్రి భూమన్న ఇదిగారిని రాష్ట్ర కార్యవర్గంలో కార్య దర్శిగా నియమించి నియామక పత్రం అందజేశారు. కార్యదర్శిగా నియమింపబడ్డ మారుతికి రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీసీలకు సేవ చేస్తూ రాజ్యాధికార దిశగా ఉద్యమరూపం పోరాటంలో పాల్గొని కుల సంఘాలను, కార్యకర్తలను, ముఖ్యంగా మహిళలను, యువతను సమీకరించి జిల్లా రాష్ట్ర కార్యవర్గాలతో సమన్వయంగా సహకారంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా గోపన్పల్లికి చెందిన వడ్డెర కుల సంఘ అధ్యక్షుడు వడ్డే సురేందర్ బిసి ఉద్యమంలో భాగంగా పాల్గొంటానని ప్రత్యక్షంగా వారితో పాటు ఉంటానని, ఉద్యమంలో భాగం అవుతానని హామీ ఇచ్చారు. సురేందర్ ని రాష్ట్ర కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ సమావేశంలో బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ తో పాటు బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, కోటగిరి మారుతి ముదిరాజ్, రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ వడ్డెర, సత్యనారాయణ, రాజు వడ్డెర , దుర్గా ప్రసాద్, రాకేష్, ఇ.రాజు ప్రసాద్, శివ కుమార్ యాదవ్ , క్రాంతి ముదిరాజ్ పాల్గొన్నారు.






