నమస్తే శేరిలింగంపల్లి: దేశంలో రోజురోజుకు కొత్త కొత్త ప్రాణాంతక వైరస్ లు వస్తున్నాయని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సామాజిక సేవా రత్న అవార్డు గ్రహీత, నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్ పేర్కొన్నారు . గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మొహర్ పార్క్ గ్రంథాలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు నేతాజీ నగర్ కాలనీ ప్రజలకు కరోన నివారణ టీకాలు వేయించారు. ఈ సందర్భంగా భేరి రాంచందర్ యాదవ్ మాట్లాడుతూ కరోనా వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఏ.ఎన్.ఏం అనిత,ఆశా వర్కర్ అరుణ, సుధా రాణి, గుల్ మెహర్ పార్క్ కాలనీ అధ్యక్షులు షేక్ కాసిం, రాజేష్, రంజిత్, రాముడు, కే.నరసింహ యాదవ్, కే.రాము యాదవ్, అరుణ పాల్గొన్నారు.
