నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీనగర్‌లో బుధవారం డీఆర్ఎఫ్ ఆద్వర్యంలో శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు భెరి రాంచందర్ యాదవ్ డీఆర్ఎఫ్ సిబ్బందిచే ప్రతి వీదిలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని నిర్లక్ష్యం చేయరాదని, నివురుగప్పిన నిప్పులా ఉన్న వైరస్ మల్లీ ఎప్పుడైన ఉదృతంగా విస్తరించవచ్చని అన్నారు. ఈ క్రమంలోనే కాలనీ వాసులంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, ఏమాత్రం అనారోగ్యంగా అనిపించినా అశ్రద్ధ చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు రాయుడు, సభ్యులు పోలీస్ వెంకటేష్, భేరీ చంద్రశేఖర్ యాదవ్, రాము, మల్లేష్, రాజు, అశోక్, లవన్, ఆచారి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
