రంగారెడ్డి జోన్ కొత్త‌ సీజీఎం ఆనంద్‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన సైబ‌ర్ సిటి స‌ర్కిల్ 327 బృందం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ రంగారెడ్డి జోన్ సీజీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆనంద్‌ను సైబర్ సిటీ సర్కిల్ 327 యూనియన్ అధ్య‌క్షుడు కె.వెంక‌టేశ్వ‌ర్లు బృందం బుధ‌వారం మర్యాదపూర్వకంగా క‌ల‌సి, ప‌విత్ర‌మైన‌ బిల్వ ప‌త్రం మొక్క‌ను అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్బంగా సైబ‌ర్ సిటీ స‌ర్కిల్ ప‌రిధిలోని తాజా ప‌రిస్థితులను నూత‌న సీజీఎంకు వారు వివ‌రించారు. స‌ర్కిల్ ప‌రిధిలో విద్యుత్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి త‌మ పూర్తి స‌హ‌కారం అందింస్తామ‌ని సీజీఎంకు వారు తెలిపారు. ఆనంద్‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన వారిలో సైబర్ సిటీ సర్కిల్ సెక్రెటరీ శ్యామ్ సుందర్, గచ్చిబౌలి డివిజన్ ప్రెసిడెంట్ వెంకట్ రామ్ రెడ్డి, కొండాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ రమేష్, సెక్రెటరీ రాజేందర్ నాయక్, కె. రాజశేఖర్, కొత్త జూనియర్ లైన్‌మెన్‌లు యాదయ్య, నగేష్, తిరుపతి, భరత్ భూషణ్, మల్లేష్ నాయక్, శ్రీనివాస్ నాయక్, శివ, నాగరాజు, కోటి నాయక్ త‌దితరులు పాల్గొన్నారు.

సీజీఎం ఆనంద్‌కు శుభాకాంక్ష‌లు తెలిపుతున్న‌ సైబ‌ర్ సిటి స‌ర్కిల్ 327 అధ్య‌క్షుడు వెంక‌టేశ్వ‌ర్లు బృందం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here