శేరిలింగంపల్లి, ఫిబ్రవి 11 (నమస్తే శేరిలింగంపల్లి): నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను తీరుస్తూ గచ్చిబౌలి డివిజన్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న గచ్చిబౌలి కార్పొరేటర్ వాసెపల్లి గంగాధర్ రెడ్డి నాలుగు సంవత్సరాలు కార్పొరేటర్ పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను నేతాజీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు హనుమంతు నాయక్, ఉపాధ్యక్షులు రాయుడు, ఉరడి మలకయ్య, బి రాంబాబు నాయక్, నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, మహిళలు, యువజన నాయకులు, కాలనీ పెద్దలు పెద్ద ఎత్తున తరలి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు.