తరాలు మారినా.. తలరాతలు చెదిరినా..
తనువొగ్గి, తలవొగ్గి సమాజ మనుగడ తన ధ్యేయమని
సాగే ఓ తరుణీ నీకు వందనం
చరిత్ర రాసే సిరా మారినా
ఆధమాసురుల చిరునామా మారినా
మొక్కవోని సహనంతో.. మానవ మనుగడకు
చిరునామాగా నిలిచిన మీ సహనానికి వందనం
కోరలు చాచే రాక్షసులున్నా
కరోనా లాంటి మహమ్మారి వచ్చినా
నీ తోడు ఉన్నంత వరకు మేము సురక్షితం
నీ నీడలో మేము చిరంజీవులం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు…
– శారద.పి