నమస్తే శేరిలింగంపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భాగ్యనగర్ ఫౌండేషన్ ఆద్వర్యంలో ఆదివారం రన్ ఫర్ ఉమెన్ ఎంపర్‌మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాదాపూర్ హైటెక్స్ కమాన్ నుంచి ఉదయం 6 గంటలకు 10కె, 5కె, 3కె రన్ ఉంటుందని, విజేతలకు విలువైన సైకిళ్లను బహుమతులుగా అందజేయడం జరుగుతుందని అన్నారు. ఔత్సాహికులు www.ifinish.in వెబ్‌సైట్ లేదా 7093805679 ఫోన్ నెంబర్‌లలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.