
గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబ ఖాజాగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లను కలిసిన ఆయన వారికి ఓటరు స్లిప్పులను అందజేశారు. అనంతరం సాయిబాబ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతోందని అన్నారు. పట్టభద్రులంతా జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వాణిదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.





