నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కంచ గచ్చిబౌలి నవోదయ కాలనీలో స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్‌రెడ్డి పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను కాలనీ వాసులు కార్పొరేటర్‌కు వివరించారు. ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. సానుకూలంగా స్పందించిన గంగాధర్‌రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రాధాన్యత క్రమంలో సమస్యలన్ని పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్‌రావు, కాలనీ వాసులు, స్థానిక నాయకులు పాల్గోన్నారు.
