సీఎంఆర్ఎఫ్‌ ద్వారా శేరిలింగంప‌ల్లికి రూ.9.18 ల‌క్ష‌ల ఆర్ధిక‌సాయం… బాధిత కుటుంబాల‌కు చెక్కులు అంద‌జేసిన ప్ర‌భుత్వ విప్ గాంధీ…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురికి ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎంరిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.9,18,000/- ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కులను ఆదివారం ప్ర‌భుత్వ విప్ గాంధీ బాధిత కుటుంబాల‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అని అన్నారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందనిపేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట‌ర్లు వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ రంగరావు, టీఆర్ఎస్ చందాన‌గ‌ర్‌ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్‌ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

చందాన‌గ‌ర్ డివిజ‌న్ ల‌బ్ధిదారుకు సీఎంఆర్ఎఫ్ చెక్కును అంద‌జేస్త‌న్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, టీఆర్ఎస్ డివిజ‌న్‌ అధ్య‌క్షుడు ర‌ఘునాథ్‌రెడ్డి, నాయ‌కుడు కంది జ్ఞ‌నేశ్వ‌ర్

సీఎంఆర్ఎఫ్ పొందిన ల‌బ్ధిదారులు వీరే…
1. వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ కి చెందిన గోపాల్ – 60,000/-
2. ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమంబండ కి చెందిన రమేష్ -60,000/-
3.మాదాపూర్ డివిజన్ రాజారామ్ కాలనీ కి చెందిన రఘునాథ్ రావు- 60,000/-
4. కొండాపూర్ డివిజన్ అంజయ్య నగర్ కి చెందిన సరితా -60,000/-
5. కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ కి చెందిన యసఫ్ బీ- 60,000/-
6.శేరిలింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ కి చెందిన సులోచన- 60,000/-
7. మాదాపూర్ డివిజన్ గోకుల్ ప్లాట్స్ కి చెందిన వెంకట సీతారామయ్య కి -57,500/-
8.చందానగర్ డివిజన్ పీఏ నగర్ కి చెందిన రమేష్ నాయక్- 53,000/-
9.కొండాపూర్ డివిజన్ రాజీవ్ నగర్ కి చెందిన మల్లేష్.జి- 19,500/-
10.చందానగర్ డివిజన్ వేమన రెడ్డి కాలనీ కి చెందిన సాయి సూర్య తేజ -13,000/-
11.కూకట్పల్లి డివిజన్ ప్రగతి నగర్ కి చెందిన కాసమ్మ.కే-22,000/-
12.ఆల్విన్ కాలనీ డివిజన్ సాయినగర్ కి చెందిన నరేష్.కే -10,000/-
13.శేరిలింగంపల్లి డివిజన్ నెహ్రు నగర్ కాలనీకి చెందిన నారాయణ.ఎం.స్ -26,000/-
14. వివేకానంద నగర్ డివిజన్ ఆర్‌పీ కాలనీకి చెందిన పూజ – 39,000/-
15.ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండకి చెందిన సత్యనారాయణ 24,000/-
16.ఆల్విన్ కాలనీ డివిజన్ మహంకాళి నగర్ కి చెందిన శంకర్ 30,000/-
17.చందానగర్ డివిజన్ ఇందిర నగర్ కి చెందిన రాము -56,000/-
18.వివేకానంద నగర్ డివిజన్ రిక్షాపుల్లర్స్ కాలనీ కి చెందిన లక్ష్మయ్య.బి- 48,000/-
19.ఆల్విన్ కాలనీ డివిజన్ దత్తాత్రేయ కాలనీ కి చెందిన అంజి రెడ్డి- 30,000/-
20. కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ కి చెందిన దస్తగిరి- 60,000/-

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here