నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్, హఫీజ్‌పేట్ డివిజన్ల పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ జీహెచ్ఎంసీ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రెండు డివిజన్ల పరిధిలో ప్రతి కాలనీ, బస్తీలలో డీఆర్ఎఫ్ సిబ్బందిచే ట్యాంకర్ల ద్వారా హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయిస్తున్నాడు. ఆదివారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని జూబ్లీ గార్డెన్, ఆదిత్య సన్ షైన్ అపార్ట్మెంట్స్, సాయి నగర్ తండాలలో కరోనా క్రిమి సంహారక మందులను చల్లారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కరోన ఉదృతి నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, అవసరం అయితే తప్ప బయటకి రావద్దని సూచించారు.

Dear sir good morning your support is great