శేరిలింగంపల్లి, అక్టోబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): మనందరికీ ఆ సూర్య భగవానుడు ఆరోగ్యం, విజయం, దీర్ఘాయువు అందించాలని కోరుకుంటున్నానని బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. హఫీజ్ పేట్ విలేజ్, గంగారం, నలగండ్ల గ్రామంలో నిర్వహించిన ఛఠ్ పూజ మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆ సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఛఠ్ పూజ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యక్ష దైవంగా భూమి మీద మనకు మనుగడ కల్పిస్తున్న సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలుపుతూ నిర్వహించే పూజనే ఛఠ్ పూజ అని పిలుస్తారని తెలిపారు. భూమి మీద ఉండే ప్రతి ఒక్కరికి మనుగడ కల్పిస్తున్న సూర్య భగవానుడికి ఇలా కృతఙ్ఞతలు తెలియజేయడం చాలా సంతోషకరమైన సంప్రదాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ యాదవ్ , రాధాకృష్ణ యాదవ్, శ్రీనివాస్, దేవాల్ యాదవ్, నందగోపాల్ యాదవ్, పవన్ , రాజేష్ , సత్యనారాయణ రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






