శేరిలింగంపల్లి, జనవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్య రాష్ట్ర 2025 ఆంగ్ల సంవత్సర కేలండర్ ను హైదరాబాద్ అమీర్పేట కమ్మ సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చలసాని వెంగటేశ్వర రావు(సివియర్), రాష్ట్ర అధ్యక్షుడు, పిఎసి చైర్మన్ శేరిలింగంపల్లి ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ తాత మధు, మిర్యాలగూడ మాజి ఎంఎల్ఏ భాస్కర్ రావు లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు అడుసుమిల్లి వెంకటేశ్వరరావు,డాక్టర్ నాగభూషణం, పాతూరి వెంకటరావు, తాళ్లూరి చంద్రమౌళి, పొట్లూరి పాండురంగారావు, పినపాక ప్రభాకర్, శివన్నారాయణ, శ్రీనివాస ప్రసాద్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.
