శేరిలింగంపల్లి, జనవరి 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శేరిలింగంపల్లి డివిజన్ పొట్ట నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దోమల నివారణ వాహనాలను తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. ప్రభుత్వం, జిహెచ్ఎంసి దోమల నివారణ చర్యలు చేపట్టడంలో విఫలం కావడంతో సొంత ఖర్చు లతో దోమల నివారణ వాహనాలను కొనుగోలు చేసినట్లు నరేందర్ యాదవ్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడం అభినందనీయం అంటూ పొట్ట నరేందర్ యాదవ్ దోమల నివారణ కోసం తీసుకున్న చర్యలను కేటీఆర్ అభినందించారు.






