అల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ) లో సత్తా చాటిన బొబ్బ నవతారెడ్డి

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ లో బొబ్బ నవతారెడ్డి ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. న్యాయవాద వృత్తిలో శాశ్వత ప్రాక్టీస్ కోసం అత్యంత కీలకమైన ఈ పరీక్షలో విజయం సాధించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నవతారెడ్డి మాట్లాడుతూ హక్కు ఉన్నచోట పరిష్కారం ఉంటుంది. where there is a right, there is a remedy. సత్యమేవ జయతే, satyameva jayathe అనే న్యాయ సూత్రాన్ని నమ్ముకున్నానని, ఇదే స్ఫూర్తితో న్యాయసేవలో ముందుకు సాగుతానని తెలిపారు. ఈ పరీక్షలో విజయం సాధించినందుకు ఆమె తండ్రి బొబ్బ విజయ్ రెడ్డి, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, స్నేహితులు, తోటి న్యాయవాదులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here