నాన‌క్‌రామ్‌గూడలో సేవ‌భార‌తి ర‌క్త‌దాన శిబిరం… దాత‌ల‌కు ప్ర‌శంస ప‌త్రాలు అంద‌జేసిన కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని నాన‌క్‌రామ్‌గూడ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో శ‌నివారం సేవాభార‌తి ఆద్వ‌ర్యంలో ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించారు. బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరిక‌న్ హాస్పిట‌ల్ సౌజ‌న్యంతో చేప‌ట్టిన ఈ శిబిరంలో స్థానిక యువ‌కులు పెద్ద సంఖ్య‌లో పాల్గొని ర‌క్తదానం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి భార‌త్‌మాత చిత్ర‌ప‌టానికి నివాళల‌ర్పించి, ర‌క్త‌దాత‌ల‌కు ప్ర‌శంసా ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ క‌రోనా విళ‌య తాండ‌వం చేస్తున్న వేళ స‌రైన ర‌క్త‌నిల్వ‌లు లేక రోగులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అన్నారు. దానికి తోడు క‌రోనా వ్య‌క్సినేష‌న్ తీసుకున్న వారు కొద్దిరోజుల పాటు ర‌క్త‌దానం చేయ‌లేని ప‌రిస్థితిల్లో త‌ల‌సేమియా లాంటి త‌ర‌చు ర‌క్తం అవ‌స‌ర‌ప‌డే రోగులు మ‌రింత ఇబ్బందులు ప‌డే ప‌రిస్థితుల‌ను గుర్తెరికి సేవ‌భార‌తీ లాంటి సంస్థ ర‌క్త‌దాన శిబిరాన్ని ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. యువ‌త ఈ విష‌యాన్ని అర్థం చేసుకుని ర‌క్త‌దానం చేసేందుకు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో డాక్టర్లు విజ‌య్‌ రామ్ రెడ్డి, ప్రభాకర్, చిన్న సిబ్బంది బాలు, కిరణ్, మోహన్ నాయక్ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ యుధవీర్ నిర్వాహ‌ణ బృంద స‌భ్యులు శ్రీనివాస్, ఈశ్వర్, బండారి విట్టల్, దార్గుపల్లి శ్రీనివాస్, ఈశ్వర్, సుదర్శన్, ఇండ్ల శ్రీనివాస్, యశ్వంత్, నానక్ రామ్ గూడ బిజెపి నాయకులు మీన్ లాల్ గారు, శివ సింగ్ గారు, సేవ భారతి కార్యకర్తలు పాల్గొన్నారు.

ర‌క్త‌దాత‌ల‌కు ప్ర‌శంసా ప‌త్రాలు అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here