నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ డివిజన్ పరిధిలోని ఎఫ్ సీ ఐ కాలనీ నుండి పటేల్ కుంట చెరువు వరకు నాలా పూడికతీత పనులను జిహెచ్ఎంసి అధికారులతో కలిసి స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ లో నెలకొన్న సమస్యలను దశల వారీగా అభివృద్ధి చేస్తామని అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూస్తున్నామన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా ముంపు ప్రాంతాలు మునిగిపోకుండా ముందస్తు చర్యలో భాగంగా కూరుకుపోయిన నాలా పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రాబోయే వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాలా పూడికతీత పనులలో వేగం పెంచాలని, పనులలో ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ స్రవంతి, ఏఈ శివప్రసాద్ వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి, సుప్రజ, తదితరులు పాల్గొన్నారు.
