నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లిలోని దేవుని (చిన్న) చెరువు వద్ద జరిగిన దాడి ఘటనపై విచారణ చేపట్టి బిజెపి రాష్ట్ర అధిష్టానానికి నివేదికను అందజేయనున్నట్లు రంగారెడ్డి అర్బన్ జిల్లా బిజెపి అధ్యక్షులు సామ రంగారెడ్డి చెప్పారు. బిజెపి రాష్ట్ర కమిటీ సూచనల మేరకు జాతీయ ఖాదీ బోర్డ్ మెంబర్ పేరాల శేఖర్, ఆసిఫాబాద్ జిల్లా బిజెపి ఇంఛార్జి శ్రీకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి వై. శ్రీధర్ నేతృత్వంలో విచారణ చేపట్టడం జరుగుతుందన్నారు విచారణ అనంతరం నివేదికను రాష్ట్ర పార్టీకి అందజేస్తారన్నారు.