నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని నడిగడ్డతాండా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. బిజెపి రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి నడిగడ్డతాండ బిజెపి నేతలు, తాండా వాసులు బుధవారం ఎమ్మెల్యే గాంధీ నివాసంలో కలిసి సమస్యపై విన్నవించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో శాశ్వత పరిష్కారం చూపాలనే చర్చ జరిగినపుడు, నివసిస్తున్న వారికి ఒత్తిడి తగ్గించేలా చూడాల్సిన అవసరాన్ని గుర్తించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో దేవనూరి చందు, ఎడ్ల ఆంజనేయులు, రాథోడ్ రవీందర్ నాయక్, ఆర్టీసీ ఈశ్వర్, సోమేష్ కుమార్, సిబి శివ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Super