నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చందానగర్ మున్సిపల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. పెండింగ్ లో ఉన్న పనులను, నూతనంగా చేపట్టనున్న పనుల టెండర్ల పక్రియ ఎంత వరకు వచ్చిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు ఈఈ శ్రీకాంతి, డీఈ వాసంతి, ఏఈ, వర్క్ ఇన్‌స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
