నమస్తే శేరిలింగంపల్లి:మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా బస్తీ లోతట్టు ప్రాంతాలను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ స్థానికులతో కలసి పర్యటించారు. డివిజన్ పరిధిలోని కాలనీలు వరద ముంపునకు గురికాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు సహాయక చర్యలు చేపట్టడంతో పాటు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలు తగ్గేంతవరకు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బస్తి అధ్యక్షుడు తిరుపతి నాయక్, కృష్ణ నాయక్, స్వామి నాయక్, సుధాకర్, దశరథ్, విజయ రామరావు, మధు, కమలాకర్, రమేష్, రత్నాకర్, లక్పతి, చిరంజీవి, కృష్ణ చెన్నగొలి, బస్తీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.