నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ రైల్వేస్టేషన్ వద్ద గల అండర్ బిడ్జీని స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. వర్షపు నీటితో బ్రిడ్జీలో నీరు నిలిచి ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికుల ఫిర్యాదు మేరకు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్పందించి రైల్వే బ్రిడ్జిని పరిశీలించారు. బ్రిడ్జి కింద నీరు నిల్వ ఉండకుండా తగిన తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటానని, ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.