నమస్తే శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్ కి చెందిన నగేష్ కి అత్యవసర చికిత్స కింద సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 32 వేల చెక్కును బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటుందని అన్నారు. అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు గుమ్మడి శ్రీనివాస్, సైదేశ్వర్ రావు, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.