శేరిలింగంపల్లి, నవంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): చలికాలం ప్రారంభమై చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి శానిటేషన్ డిపార్ట్మెంట్ సిబ్బందికి మిర్యాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత రగ్గుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ట్రస్ట్ డైరెక్టర్ మిర్యాల ప్రీతమ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చందానగర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్యాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మిర్యాల రాఘవరావు, మిర్యాల ప్రీతంకి ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. మిర్యాల రాఘవరావు మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తున్న శానిటేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది సేవలను ప్రశంసించారు. వారికి చిన్న సహాయంగా రగ్గులు అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తిబాబు, త్రినాథ్, యాదయ్య, రామాంజనేయులు, పరదేశి నాయుడు, వెంకటేశ్వరరావు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.






