మున్సిప‌ల్ కార్మికులు ఐక్యంగా ఉండాలి: డా.తిప్పర్తి యాదయ్య

శేరిలింగంపల్లి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లిలోని ఎస్.ఎన్.రెడ్డి గార్డెన్ లో తెలంగాణ మున్సిపల్ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగ, కార్మిక సంఘం ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జోనల్ మహాసభను బుధ‌వారం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి సంఘం గౌరవ అధ్యక్షుడు, మున్సిపల్ ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ డా. తిప్పర్తి యాదయ్య, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మోహన్, లింగంపల్లి సర్కిల్ మెడికల్ ఆఫీసర్ డా.రంజిత్ లు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు.

స‌భ‌లో మాట్లాడుతున్న డా.తిప్పర్తి యాదయ్య

ఈ సందర్భంగా డా.తిప్పర్తి యాదయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు అందరూ ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాల‌న్నారు. కార్మికుల సమస్యల ప‌రిష్కారం కోసం తానెప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. అనంతరం ఇటీవల డిప్యూటీ కమిషనర్ ప‌ద‌వి నుంచి స్పెషల్ గ్రేడ్ ఆఫీసర్ గా పదోన్నతి పొందిన సందర్భంగా ఆయనను నాయ‌కులు ఘనంగా సన్మానించారు.

తెలంగాణ మున్సిపల్ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగ, కార్మిక సంఘం సలహాదారు తిప్పర్తి మహేష్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిరు నీలం, ప్రధాన కార్యదర్శి షేక్ ఆశ్రఫ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగేషప్ప, ఉపాధ్యక్షులు సాయి కుమార్, భిక్షపతి, అచ్యుత్, జోనల్ పరిధిలోని ఎస్ఆర్పిలు, ఎస్ఎఫ్ఏలు, నాలుగు సర్కిళ్ల‌ అధ్యక్ష, కార్యదర్శులు, కమిటీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here