శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట కాలనీలో రూ.6 కోట్ల 36 లక్షల 78 వేల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ ను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అడ్డగుట్ట కాలనీ లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని హంగులతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించడం జరిగిందని, ప్రజలకు అందుబాటులో కి వస్తుందని, సర్వ హంగులతో సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు .






