శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (నమస్తే శేరిలింగంపల్లి): రక్షా బంధన్ (రాఖీ పండుగ) సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డికి ఆరెకపూడి గాంధీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్ అని అన్నారు. రక్షాబంధన్ వేడుకల సందర్భంగా సహోదర భావం మరింతగా పరిఢవిల్లాలని అన్నారు.






