రూ.2 కోట్లతో పీజేఆర్ నగర్‌లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్

శేరిలింగంప‌ల్లి, జూన్ 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో ఉన్న పీజేఆర్ నగర్‌లో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న నూతన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నిర్మాణ పనులను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పీజేఆర్ నగర్ కాలనీ వాసుల చిరకాల కోరిక అయిన ఈ ఫంక్షన్ హాల్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, అన్ని హంగులు, సకల సౌకర్యాలతో ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మిస్తామని తెలిపారు. ఈ ఫంక్షన్ హాల్ పేద, మధ్యతరగతి కుటుంబాలతోపాటు పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెంకటేష్ గౌడ్ పేర్కొన్నారు. వివాహాలు, శుభకార్యాలు, సమావేశాలు, సభలు, చిన్నపాటి వేడుకలు, జన్మదినోత్సవాలు వంటి కార్యక్రమాల నిర్వహణకు ఈ హాల్ అనువుగా ఉండేలా నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఫంక్షన్ హాల్‌తోపాటు నిర్మిస్తున్న చిల్డ్రన్ పార్క్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శశిధర్ పట్వారీ, జి. రవి, యాదగిరి, అగ్రవాసు, వాలి నాగేశ్వరరావు, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here