శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో స్థానిక ముదిరాజ్ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ఆశయాలను, దిశా నిర్దేశాన్ని చర్చించారు. ఇందుకు సంఘం సభ్యులు అందరూ అంగీకారం తెలిపారు. అనంతరం సంఘానికి చెందిన వెంకటయ్య హఠాన్మరణం చెందడంతో ఆ విషయాన్ని తెలుసుకున్న ముదిరాజ్ సంఘం సభ్యులు అందరూ కలిసి వెంకటయ్య భార్యకు సంఘం తరఫు నుంచి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయినందన్ ముదిరాజ్, రాజు ముదిరాజ్, మందుల కృష్ణ ముదిరాజ్, రోహిత్ ముదిరాజ్, సంతోష్ ముదిరాజ్, మల్లేష్ ముదిరాజ్, ప్రకాష్ ముదిరాజ్, చందు ముదిరాజ్, కృష్ణ ముదిరాజ్, అంజయ్య ముదిరాజ్, బాలు ముదిరాజ్, ఉమేష్ ముదిరాజ్, బాలరాజ్ ముదిరాజ్, అనిల్ ముదిరాజ్, నితిన్ ముదిరాజ్ పాల్గొన్నారు.