శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 6 (నమస్తే శేరిలింగంపల్లి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై హర్షం వ్యక్తం చేస్తూ హఫీజ్‌పేట డివిజన్‌కు చెందిన బీజేపీ నాయకులు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని హుడా కేఫ్ చౌరస్తాలో స్థానిక డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రమణయ్య, బీజేపీ నాయకులు మహేష్ యాదవ్ , దేవానంద్ యాదవ్ , ఆళ్ల వరప్రసాద్ రవి గౌడ్ , సత్యనారాయణ రాజు , పవన్ కుమార్ , జగదీశ్వర్ గౌడ్ , శ్రీనివాస్ యాదవ్ , రామచంద్ర యాదవ్ , సుబ్బారెడ్డి , శ్రీనివాసులు యాదవ్ , రాజు ముదిరాజ్ , మహిళ మోర్చా నాయకులు , బీజేవైఏం నాయకులు , కార్యకర్తలు, స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.