శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 6 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ పరిధిలోని ఆయా డివిజన్ల లో నెలకొన్న పలు సమస్యలు,పెండింగ్ పనులు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ చందానగర్ సర్కిల్ పరిధిలోని డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలకు పరిష్కారాలు, చేపట్టే పలు అభివృద్ధి పనులతో , ప్రజల ఇబ్బందులను తీర్చే విధంగా చర్యలు చేపట్టే విధంగా పలు సూచనలు ఇచ్చామని తెలిపారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి చేపట్టవలసిన పనులలో జాప్యం నివారణకు చర్యలు చర్చించామన్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రథమ ప్రాధాన్యతగా పనులు చేపట్టాలని, కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశం లో జిహెచ్ఎంసి అధికారులుEE KVS రాజు, DE దుర్గాప్రసాద్, DE శ్రీదేవి, AE ప్రశాంత్, AE సంతోష్, నాయకులు రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.