శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): బీహెచ్ఈఎల్ మాజీ అధ్యక్షుడు, బిహెచ్ఈఎల్ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి, ఎంతోమందికి జీవనోపాధి కల్పించి రాజకీయాలలో తనదంటూ ఒక ముద్ర వేసిన జి.ఎల్లయ్య దశదినకర్మలో చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డితో నియోజకవర్గ ఇన్చార్జ్ రవికుమార్ యాదవ్ పాల్గొని ఎల్లయ్య చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.






