వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ ప‌ర్య‌ట‌న

మాదాపూర్/హఫీజ్ పేట్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ల‌ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ గురువారం పర్య‌టించారు. ఇంజినీరింగ్ ఈఈ చిన్నారెడ్డి, హఫీజ్ పేట్ డివిజన్ ఏఈ అనురాగ్, మాదాపూర్ డివిజన్ ఏఈ ప్రశాంత్ ల‌తో క‌లిసి ఆయా ప్రాంతాల్లో పొంగిపొర్లుతున్న అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీల‌ను, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల‌ను ప‌రిశీలించారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని హరిజన బస్తి, శ్రీ రామ కాలనీ, ఇజ్జ‌త్‌ నగర్, కృష్ణ కాలనీలో నీరు నిల్వ ఉన్న‌ ప్రదేశాలను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను పరిశీలించారు.

వ‌ర‌ద‌నీటిలో ప‌ర్య‌టిస్తున్న కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ అపార్ట్‌మెంట్స్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. మదీనాగూడా యశోద పర్ల్స్, జనప్రియ డాల్ఫిన్ అపార్ట్‌మెంట్స్, రామకృష్ణ నగర్, మంజీర రోడ్డు, కల్కి హైట్స్ అపార్ట్‌మెంట్స్ సెల్లార్ల‌లో నిలిచిన నీటిని మోటార్ల ద్వారా తొలగించే పనులను పర్యవేక్షించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో చాలా ప్రాంతాలు ఇంకా వర్షపు నీటిలోనే ఉండడంతో సహాయక చర్యలను స్వయంగా ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుందని, ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

స్థానికుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్న కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here