శేరిలింగంపల్లి, ఆగస్టు 16 (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా(అర్భన్) ఉపాధ్యక్షుడిగా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన మూల అనిల్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రినివాస్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మూలా అనిల్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలను అప్పగించిన అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా అర్బన్ లో పార్టీ అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.






