- ఓటు హక్కు వినియోగించుకున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్ అనుప దంపతులు
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిళ్లలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మొదటి రెండు గంటల్లో ఏడు శాతానికి మంచి పోలింగ్ నమోదు కాలేదు. శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలో మొత్తం 12 పోలింగ్ స్టేషన్లలో కలిపి 7.66 ఓటింగ్ శాతం నమోదు కాగా చందానగర్ సర్కిల్ 21 పరిధిలో మొత్తం 21 పోలింగ్ స్టేషన్లలో కలిపి 7.16 శాతం పోలింగ్ నమోదయింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అనుప దంపతులు రెడ్డి ఫ్రెండ్స్ లోనే ఎంసిహెచ్ సెంట్రల్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. విద్యావంతులు తమ ఓటు హక్కును వినియోగించుకోని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని వారు పిలుపునిచ్చారు.