నమస్తే శేరిలింగంపల్లి: కుకట్‌పల్లి కోర్టు బార్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగా చందానగర్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది అవ్వారు ఆదిత్యకుమార్ నియమితులయ్యారు. శుక్రవారం జరిగిన బార్ అసోసియేసన్ ఎన్నికల్లో ఆదిత్యకుమార్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా చందానగర్ ఫ్రెండ్స్ యూత్ ప్రతినిధులు రామ్‌చందర్‌రాజు, కొడమంచిలి నాగమహేష్, గుర్రపు శ్రీకాంత్, మల్లికార్జున్, శివయాదవ్‌లు ఆదిత్యకుమార్‌ను ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో ఆదిత్య మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.
