నమస్తే శేరిలింగంపల్లి: పాలమూరు రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఊట్కూర్ మండల శాఖ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి మక్తల్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ నంద కుమార్ యాదవ్ హాజరై పన్న ఇంచార్జిలకు పలు సూచనలు చేశారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి. కొండయ్య మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి రాం చందర్ రావుకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం భాస్కర్, కర్నే స్వామి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎం భరత్, మండల అధ్యక్షుడు జీ రమేష్, ప్రధాన కార్యదర్శి వెంకట్, ఎంపీటీసీ సభ్యులు హనుమంతు, శివ, సీనియర్ నాయకులు కె.ఆశప్ప, లక్ష్మణ్, వెంకటయ్య, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కే గోపాల్, పన్నా ఇన్చార్జిలు రాజు, తారక్, రమేష్, నాగప్ప, బలరాం, మారుతి, లక్ష్మణ్, అరవింద్, శ్రీకాంత్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు రోషనప్ప పాల్గొన్నారు.
