శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఆయన నివాసంలో జరిగిన వేడుకల్లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శేరిలింగంపల్లి కో ఆర్డినేటర్ మూగల రఘునందన్ రెడ్డి, ఇలియాస్ షరీఫ్, మారెల్ల శ్రీనివాస్, సందీప్ రెడ్డి, అయాజ్ ఖాన్, జగన్ పాల్గొన్నారు. అనంతరం లేగల మైదానంలో శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతలకు విశ్వేశ్వర్ రెడ్డి బహుమతులను అందజేశారు.

