శేరిలింగంపల్లి, అక్టోబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ కాలనీలో గత ముడు రోజుల క్రితం అకాల మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు ఆది నారాయణ నివాసంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించి, ఆయన కుటంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టు ఆదినారాయణ మృతి తిరని లోటని, పాత్రికేయ వృత్తికే వన్నె తెచ్చారని అన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే గాంధీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, దాత్రి గౌడ్, పవన్ గౌడ్, కనికిరెడ్డి, కృష్ణ ప్రసాద్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.