మొక్క‌లు నాటి ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించాలి: ప్రభుత్వ విప్ గాంధీ

ఆల్విన్ కాల‌నీ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్‌ నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న థీమ్ పార్క్ అభివృద్ధి పనులను స్ధానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీ, చుట్టుపక్కల ప్రజలకు ఈ థీమ్ పార్క్ ఎంతగానో ఉపయోగపడుతుంద‌ని అన్నారు. ఇందులో పార్క్ చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే జిమ్ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని, పిల్లలకు ఆట స్థలం ఏర్పాటు చేస్తామ‌ని, పార్కును సుందరవనంగా తీర్చిదిద్ది త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెస్తామ‌ని తెలిపారు.

ఆల్విన్ కాల‌నీ డివిజ‌న్‌లోని పీజేఆర్ న‌గ‌ర్ పార్కును ప‌రిశీలిస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేట‌ర్ దొడ్ల వెంక‌టేష్ గౌడ్

కాంక్రీట్ జంగిల్‌లా మారిన న‌గ‌రంలో పార్కుల వ‌ల్ల చ‌క్క‌ని ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ల‌భిస్తుంద‌ని, మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంద‌ని ఎమ్మెల్యే అన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటి ప‌ర్య‌వ‌ర‌ణాన్ని కాపాడాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, తెరాస నాయకులు దొడ్ల రామకృష్ణ, కాశీనాథ్ యాదవ్, రాజేష్ చంద్ర, వాసు, మధు, బోయ కిషన్, కుమారి, మంజుల, శిరీష, మధులత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here