ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖల యంత్రాంగం సమన్వయంతో పని చేస్తూ తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సూచించారు. మియాపూర్, చందానగర్ డివిజన్ల పరిధిలోని ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.

మియాపూర్ డివిజన్ లో మ్యాన్ హోల్స్ ను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ బొల్లారం ప్రధాన రహదారి పై లక్కీ రెస్టారెంట్, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ రోడ్డు వద్ద, చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్, శాంతి నగర్, పీజేఆర్ నగర్ కల్వర్టు,గ్యాస్ గోదాం నాల కల్వర్టు, జవహర్ కాలనీ, జై భవాని హార్డ్ వేర్ రోడ్డు, వేముకుంట కాలనీ లలో వర్షాల వలన కలిగిన నష్టాలను, ఇబ్బందులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముంపు ప్రాంతాలు మునిగిపోకుండా ముందస్తు చర్యలో భాగంగా అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని, మాన్ సున్, ఎమర్జెన్సీ టీమ్స్ లు అన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని సూచించారు.

చందానగర్ డివిజన్ లో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

రోడ్లపై నీటి నిల్వ లేకుండా చూడాలని, వాహన దారులకు ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేలా వాహనాలను మళ్లించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు చేపట్టారు. నాలాలకు రక్షణ చర్యలలో భాగంగా ఫెన్సింగ్ వేయాలని, రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ హన్మంత రావు, ఎస్ ఈ శంకర్ నాయక్, ఈఈ శ్రీకాంతిని, డీఈ స్రవంతి, ఎస్ ఆర్ పీ కనకరాజు, ట్రాఫిక్ సీఐ సుమన్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, నాయకులు నరేంద్ర బల్లా, రాజు, అక్బర్ ఖాన్, యూసఫ్, దాస్ , శ్రీనివాస్, ఖాదర్, అల్తాఫ్, రవి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ డివిజన్ లోని నాలాను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here