నమస్తే శేరిలింగంపల్లి: హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత గల తొలి ఏకాదశి పండుగలకు ఆది పండుగ అని, తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంట పెట్టుకోచ్చే తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆషాడ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారని, సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి, శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయని తెలిపారు. ఏకాదశి అంటే పదకొండు అని అర్థమని, మనకు ఉన్న ఐదు జ్ఞానేంద్రియాలు , ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు, ఈ పదకొండు ఏకోన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశి అని పేర్కొన్నారు. ఆషాఢ మాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారని, దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారన్నారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అంటారని తెలిపారు. ఆషాడ శుద్ధ ఏకాదశిని ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్ని పండుగలు తెలంగాణ రాష్ట్రంలో వైభోవేపేతంగా నిర్వహించుకుంటున్నాం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.