ప్రతీ సమస్యను పరిష్కరిస్తాం – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ప్రతీ సమస్యను పరిష్కరించి గచ్చిబౌలి డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని హిల్ రిడ్జ్ స్ప్రింగ్స్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని అన్ని సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపుతామన్నారు.‌ ఎల్లా హోటల్ వారు లౌడ్ స్పీకర్ల తో ఇబ్బందికి గురి చేస్తున్నారని, కాలనీ లో ప్రశాంతత లేకుండా చేస్తున్నారని, రోడ్డు ను బ్లాక్ చేస్తున్నారని అపార్ట్మెంట్ అసోసియేషన్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

హిల్ రిడ్జ్ స్ప్రింగ్స్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యుల సమస్యలు వింటున్న‌ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ

రోడ్లు, వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంబందిత సమస్యలను వివరించారు. కాలనీ లో ప్రశాంత వాతావరణం కల్పిస్తామని, అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సైబరాబాద్ ఆల్ అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవి శంకర్, హిల్ రిడ్జ్ స్ప్రింగ్స్ అపార్ట్మెంట్స్ నుంచి ప్రదీప్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, భరద్వాజ్, అనంత్ కుమార్, సురేష్ అగర్వాల్, కేపీ రామ్, అపార్ట్మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు.

అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here