నమస్తే శేరిలింగంపల్లి: యాదవుల అభ్యున్నతికి శాయశక్తులా కృషి చేస్తానని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్ యాదవ సోదరులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. బిహెచ్ఇఎల్ యాదవ సోదరులు ఏర్పాటు చేసిన యాదవ ఐక్యత సమ్మేళన కార్యక్రమంతో యాదవ కుటుంబ సభ్యులు కలవడం ఆనందంగా ఉందన్నారు.
యాదవుల ఐక్యతకు కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. అనంతరం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ను యాదవులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీహెచ్ఈఎల్ ఓ బి సి ప్రెసిడెంట్ రామరాజు యాదవ్, లక్ష్మీ నారాయణ యాదవ్, సంజీవ్ ప్రసాద్ యాదవ్, నాగరాజ్ యాదవ్, పోచయ్య యాదవ్, సుబ్బారావు యాదవ్, ఎన్ జి భాస్కర్ యాదవ్, ఓ.శేఖర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, అప్పలరాజు యాదవ్, బుచ్చయ్య యాదవ్, యాదవ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.