నమస్తే శేరిలింగంపల్లి: ప్రధానమంత్రి మోడీ బహిరంగ సభను చూసి తెలంగాణ సీఎం కేసీఆర్ కు భయం చుట్టుకుందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిహిన బీజేపీ భారీ బహిరంగ సభకు రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి బిజెపి నాయకులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు. మోడీ పాలనలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి దాదాపు 3000 మంది బిజెపి శ్రేణులతో భారీ బహిరంగ సభకు వెళ్లినట్లు తెలిపారు.
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారత ప్రధాని మోడీ సమక్షంలో బిజెపిలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి రవికుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి బిజెపిలో చేరడం సంతోషకరమని చెప్పారు. శేరిలింగంపల్లి లో బిజెపి సత్తా ఏంటో చూపుతామన్నారు.
.