భ‌వానీపురం వినాయ‌కుడి ల‌డ్డూ @ 70,100 – కైవసం చేసుకున్న ల‌క్ష్మీకాంత్ రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందానగర్ డివిజన్ ప‌రిధిలోని భవానిపురం కాలనీ సంక్షేమ సంఘం ఆద్వ‌ర్యంలో 9 రోజులు పూజ‌లందుకున్న వినాయ‌కుడి నిమ‌జ్జ‌నం ఘ‌నంగా జ‌రిగింది. ఈ క్ర‌మంలో వినాయ‌కుడి ల‌డ్డుని వేలం వేయ‌గా కాల‌నీ మాజీ అధ్య‌క్షుడు లక్ష్మీకాంత్ రెడ్డి రూ. 70,100 కు కైవసం చేసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా కాల‌నీ సంక్షేమ సంఘం అధ్య‌క్షులు ర‌ఘునంద‌న్ రెడ్డితో పాటు స‌భ్యులంతా వారికి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. వారి కుటుంబంలో విఘ్నాల‌న్నీ తొల‌గిపోయి కుటుంబ స‌భ్యులంతా ఆయురారోగ్య అశ్యైర్యాల‌తో వ‌ర్ధిల్లాల‌ని విఘ్నేశ్వ‌రుడిని ప్రార్ధిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, కార్యనిర్వాహణాధికారి సుందరం, కోశాధికారి శ్రీనివాస్ రావు, సలహాదారుడు లక్ష్మి కాంత్ రెడ్డి సభ్యులు వైటీ కృష్ణారెడ్డి, హేమాద్రి, కిరణ్ బాబు, ప్రేమ్ కుమార్, రామారావు, శ్రీనివాస్, సందీప్, నరేష్, భూమన్న, పర్వతరెడ్డి, రామకృష్ణ, రాఘవులు, ప్రసాద్, లక్ష్మి రెడ్డి కాల‌నీ వాసులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

ల‌క్ష్మీకాంత్ రెడ్డికి ల‌డ్డును అంద‌జేస్తున్న అధ్య‌క్షుడు ర‌ఘునంద‌న్ రెడ్డి త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here