నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ ఖుతుబ్ షాహీ మజీద్‌లో శనివారం రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రభుత్వం తరపున మంజూరైన రంజాన్ కానుకలను ముస్లింలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకవైపు కరోనా ఉదృతంగా విస్తరిస్తున్నా ముస్లిం సోదరులు ఆనవాయితీగా తమ పండుగను సగౌరవంగా జరుపుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఎప్పటిలాగే రంజాన్ కానుకను పంపిణీ చేస్తుందని అన్నారు. ముస్లిం సోదరులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఎవరి ఇళ్లలో వారు ప్రశాంతంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదర్‌నగర్కా ర్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, మియాపూర్ డివిజన్ తెరాస మైనార్టీ నాయకులు అన్వర్ షరీఫ్, ఖాజా పాషా, ముజిబ్ తదితరులు పాల్గొన్నారు.