సీఐటీయూ ఆద్వర్యంలో శేరిలింగంపల్లిలో ఘనంగా మేడే వేడుకలు…
నమస్తే శేరిలింగంపల్లి: సీఐటీయూ శేరిలింగంపల్లి జోన్ కమిటీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం, మియాపూర్ సబ్ స్టేషన్‌ల వద్ద సంఘం నాయకులు ఎర్రజెండాను ఆవిష్కరించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా సిఐటియు జిల్లా నాయకులు కొంగరికృష్ణ మాట్లాడుతూ నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను సాకుగా చూపుతూ కార్మికుల హక్కుల పై దాడి చేస్తూ సంఘం పెట్టుకునే హక్కు ని లేకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవైపు కరోనాతో ఉపాధి రంగం పూర్తిగా దెబ్బతిని ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కార్పొరేట్ కంపెనీలకు లాభం చేసే విధంగా కార్మిక చట్టాలను తీసుకొస్తూ కార్మికుల ఉపాధి దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు జరుగుతాయని మేడే స్ఫూర్తితో పోరాటాలను జయప్రదం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోకార్మికులు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రవీందర్, సురేష్, లక్ష్మణ్, నరిసింగ్, విజయ్, మాణిక్యం, చందూ, మోహన్, చిన్నా, కుమార్ తదితరులు పాల్గొన్నారు.