మే 12న ఆన్‌లైన్‌లో ఢాక్‌ అదాల‌త్‌…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణ రాష్ట్ర పోస్టల్ శాఖ వినియోగ‌దారుల కోసం మే 12న ఢాక్ అదాల‌త్ నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలంగాణ స‌ర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్‌.రాంజేద్ర‌కుమార్ శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. క‌రోనా విజృంభ‌న కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఢాక్ అదాల‌త్ ఆన్‌లైన్‌లో నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. త‌పాల శాఖ వినియోగ‌దారులు త‌మ స‌మ‌స్య‌లు, ఫిర్యాదుల‌ను ఢాక్ అదాల‌త్ ముందు ఉంచ‌వ‌చ్చ‌ని అన్నారు. ఐతే వారు మే 6 లోపు పోస్ట‌ల్ స‌ర్వీస‌ర్ అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ మ‌న్మ‌ద‌రావు ముంద‌స్తు స‌మాచారంతో పాటు వారి వివ‌రాల‌ను అందించాల‌ని, ఈ క్ర‌మంలో ఢాక్ అదాల‌త్‌కు సంబంధించిన ఆన్‌లైన్ లింక్ వివ‌రాల‌ను వారికి పంపించ‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు. ఫిర్యాదుల‌తో పాటు సూచ‌న‌లు స‌ల‌హాలతో పోస్ట‌ల్ శాఖ సేవ‌ల‌ను మెరుగు ప‌రుచుకునేందుకు ఇదోక మంచి అవ‌కాశం అని, తెలంగాణ ప్ర‌జ‌లు ఢాక్ అధాల‌త్‌ను స‌ద్వినియోగ‌ప‌రుచుకోవాల‌ని రాజేంద్ర కుమార్ పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here