నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీలో నెలకొన్న ఎన్నో ఏండ్ల సమస్య తీరనుందని, మురుగు నీటి సమస్య శాశ్వత పరిష్కారమవుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీలో రూ. 28 కోట్లతో 10 ఎంఎల్ డీ సామర్థ్యంతో నూతనంగా నిర్మించనున్న ఎస్టీపీ నిర్మాణ పనులకు తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని అన్నారు. ప్రజా అవసరాలకునుగుణంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తుందన్నారు. తాగు నీటి సరఫరా, మరుగు నీటి శుద్ధిలో హైదరాబాద్ నగరం దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తుందని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగు నీరు అందిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఎస్టీపీల నిర్మాణం పనులు త్వరితగతిన నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎస్టీపీ విభాగం సీజీఎం పద్మజ, జీఎం వాస సత్యనారాయణ, మెగా ప్రాజెక్ట్స్ సీజీఎం కళ్యాణ శ్రీనివాస్, జీఎం నిస్సార్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, సురేందర్, తెల్లాపూర్ కౌన్సిలర్లు శ్రీశైలం, లచ్చి రామ్ నాయక్, బాబ్జీ, జ్యోతి శ్రీకాంత్ రెడ్డి, నాగరాజు, తెల్లాపూర్ మున్సిపల్ ప్రెసిడెంట్ రాగం దేవేందర్ యాదవ్, కాలనీ వాసులు శ్రీకాంత్, చంద్రశేఖర్, సత్యనారాయణ, డాక్టర్ నరేష్, డాక్టర్ సీత రమేష్, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
